తన కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8 నుంచి మరో తేదీకి మార్చవద్దంటూ హీరో విశ్వక్ సేన్ చెబుతున్న మాటలేవీ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ సినిమా పోస్ట్ పోన్ చేసేందుకే వారు మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 29న రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య రూపొందిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందీ సినిమా. డిసెంబర్ 8 నుంచి మరో తేదీకి సినిమా రిలీజ్ డేట్ మార్చితే తాను ప్రమోషన్స్ కు రానని విశ్వక్ సేన్ రీసెంట్ సోషల్ మీడియా పోస్టులో చెప్పాడు. తనలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోను తొక్కేందుకు ఇండస్ట్రీలో చాలా మంది చూస్తుంటారని ఆరోపణలు చేశాడు. విశ్వక్ సేన్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *