తమిళ హీరో విక్రమ్ ను మరో కమల్ హాసన్ అని చెబుతారు. అంత వర్సటైల్ యాక్టర్ ఆయన. అయితే వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేయడం వల్ల బాక్సాఫీస్ రేసులో వెనకబడ్డారు. విక్రమ్ చేసే ప్రయోగాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. ఇరుముగున్, స్కెచ్, కోబ్రా…ఇలా అనేక సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇన్ని రోజులకు ఓ పర్పెక్ట్ కమర్షియల్ మూవీ చేస్తున్నాడు విక్రమ్. ఇది ఆయన 62వ సినిమా.

విక్రమ్ 62 సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ పోలీస్ స్టేషన్ కు విక్రమ్ వెళ్లి..అక్కడి పోలీసులకే ధమ్కీ ఇచ్చి రావడం హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇప్పుడు ట్రెండ్ లో విక్రమ్ కు ఇది పర్పెక్ట్ మూవీ అనిపిస్తోంది. ఈ సినిమాను ఎస్ యూ అరుణ్ కుమార్ రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *