మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఖైదీ. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు చిరంజీవి. దర్శకుడు కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. చిరంజీవి పేరు మార్మోగేలా చేసిన ఈ సినిమా రిలీజై ఇవాల్టికి 40 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరంజీవి.

ఆయన స్పందిస్తూ – ‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒకసారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!..అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *