మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ మూడో వారం కల్లా ఫస్ట్ కాపీతో రెడీగా ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఆ టార్గెట్ కు తగినట్లే షూటింగ్ నాన్ స్టాప్ గా చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా గుంటూరు కారం నుంచి అప్ డేట్ వినిపిస్తోంది.

గుంటూరు కారం కొత్త షెడ్యూల్ నవంబర్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో ఓ పాటను పిక్చరైజ్ చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణకు నాలుగురోజుల షెడ్యూల్ పెట్టుకున్నారట. అటు యాక్షన్ సీక్వెన్సులు చేస్తూ…మధ్యలో పాటలు రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *