విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన పెదకాపు 1 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్స్ లో పెదకాపు 1 సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాలో ల్యాగ్ ఎక్కువైందని, ఒక దారి లేకుండా కథ సాగిందని, మధ్యలో వచ్చిన ఉప కథలన్నీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయేలా చేశాయని రెస్పాన్స్ వచ్చింది.

తొలి సినిమా ఫ్లాప్ తో ఈ సినిమాకు రెండో భాగం రూపొందించాలనుకున్న మేకర్స్ ..ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పెదకాపు 2 సినిమా ఉండకపోవచ్చు. అయితే ఓటీటీలో పెదకాపు 1 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి ఓ ఊరి పరిస్థితులను, అక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టారనే కథతో పెదకాపు 1 సినిమా రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *