సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా..పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ టిల్లు స్క్వేర్ విడుదల తేదీ ప్రకటించారు. ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ సినిమా తెరపైకి రాబోతోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందిస్తున్నారు.

అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు సక్సెస్ తర్వాత ఆ సినిమా సీక్వెల్ గా వస్తోంది టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సక్సెస్ ను కంటిన్యూ చేయాలని మూవీ టీమ్ ఆశిస్తున్నారు. గత సినిమా విజయంతో ఈ సీక్వెల్ పై ఆడియెన్స్ లో కూడా ఇంట్రెస్ట్ నెలకొని ఉంది. యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరిలో టిల్లు స్క్వేర్ రిలీజ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *