కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో వచ్చిన నాయకుడు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఆస్కార్ కు మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లింది. ఈ సినిమా 1987లో రిలీజ్ కాగా..అప్పటి నుంచి కమల్, మణిరత్నం కలిసి మళ్లీ పనిచేయలేదు. వీళ్లు వ్యక్తిగతంగా బంధువులు కూడా. ఇక ఈ కాంబో సినిమా మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత రాబోతోంది.

కమల్ హాసన్ 234వ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను కమల్ హాసన్ తో కలిసి రెడ్ జైయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్నాయి. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని వార్తలొస్తున్నాయి. మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *