స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “ఫ్యామిలీ స్టార్” టైటిల్ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు 15 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి. “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ విజయ్ దేవరకొండ హీరోయిజాన్ని కొత్తగా చూపించాయి. ఈ గ్లింప్స్ లోని ‘ఐరెనే వంచాలా ఏంటి..?’ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ‘ఐరెనే వంచాలా ఏంటి…?’ డైలాగ్ వైరల్ గా మారింది. నెటిజన్స్ ఈ డైలాగ్ ను పోస్ట్ చేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ కూడా ‘ఇంటర్నెట్ లో అసలు ఏం నడుస్తుంది..?’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ లో ‘ఇది మీరు చెప్పారా..?’ అంటూ ‘ఐరెనే వంచాలా ఏంటి..?’ డైలాగ్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా మేము కూడా ‘ఈ ట్రెండ్ లో భాగమవుతున్నాం..’ అంటూ డైలాగ్ పోస్ట్ చేసింది. “ఫ్యామిలీ స్టార్” గ్లింప్స్ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ డైలాగ్ ట్రైండింగ్ లోకి వచ్చింది.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *