హీరో నితిన్ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. నితిన్ తన కొత్త సినిమాలో పవన్ కాస్ట్యూమ్స్ తో ఆయనను అనుకరించడమే ఈ విమర్శలకు కారణం. నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో తమ్ముడు సినిమాలో పవన్ లా కనిపించాలని ప్రయత్నించాడు.

ఈ పోస్టర్ రిలీజ్ చేయగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్…నితిన్ పవన్ సినిమాలను, ఆయన గెటప్ లను, క్యారెక్టర్స్ లను అనుకరించడం తగ్గించుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అభిమాని అనే పేరుతో నితిన్ తన ప్రతి సినిమాలో పవన్ పాటలు, సీన్స్, డైలాగ్స్, డ్రెస్సింగ్ కాపీ కొడుతుంటారు. ఇప్పటికీ నితిన్ అదే ఫార్ములాను కొనసాగించడం అభిమానులకు కూడా నచ్చడం లేదు.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టుల కష్టాలతో ఈ సినిమా రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *