రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాలో తమిళ నటి ఇందూజ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. కోలీవుడ్ దర్శకుడు, నటుడు సెల్వరాఘవన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా..జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరన్నది త్వరలో వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *