పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓజీ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సుజీత్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్. ఆయనకు హ్యాపీ బర్త్ డే చెబుతూనే..ఈ ఇయర్ పేల్చేద్దాం అంటూ పోస్ట్ పెట్టింది.

విశెస్ తో పాటు ఈ ఇయర్ పేల్చేద్దాం అని క్యాప్షన్ పెట్టినందుకు అభిమానులు ఓజీ ఈ ఇయర్ ఎండ్ కు రిలీజ్ అవుతుందా…ఏంటీ సర్ ప్రైజ్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ ఈ ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఓజీ రిలీజ్ వచ్చే ఏడాది, ఈ ఇయర్ కాదంటూ చెప్పింది.

గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ కే రిలీజ్ చేద్దామనుకున్నా..పవన్ పొలిటికల్ కమిట్ మెంట్స్ వల్ల కుదరలేదు. వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ ఉండొచ్చని తెలుస్తోంది. ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *