లారెన్స్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ చంద్రముఖి 2 నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి చంద్రముఖి 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించింది. దర్శకుడు పి.వాసు తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. చంద్రముఖి 2 ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో విరివిగా పోస్టులు కనిపిస్తున్నాయి.

గతంలో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కించారు. గత నెల ప్రేక్షకుల ముందుకొచ్చిన చంద్రముఖి 2 సినిమా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. తెలుగులో అయితే ఈ సినిమాకు మరీ తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఓటీటీలో అయినా తమ సినిమాకు రెస్పాన్స్ బాగుండొచ్చు అనే చంద్రముఖి 2 సినిమా టీమ్ ఆశిస్తోంది. చంద్రముఖి 2 ఇచ్చిన రిజల్ట్ తో ఇక ఈ కథతో మరోసారి స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం ఎ‌వరూ చేయకపోవచ్చని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *