విజయ్ హీరోగా నటించిన తమిళ మూవీ లియో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన తమిళ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. వరల్డ్ వైడ్ గా లియోకు 506 కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కాయి.

విజయ్, త్రిష జంటగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ లియో సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డే వన్ నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ లియోకు మంచి వసూళ్లు దక్కాయి. దసరా సీజన్ కాబట్టి లియో ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించగలిగింది. ఫుల్ రన్ లో లియో మరిన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *