“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన చరణ్ రాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో “నరకాసుర” సినిమా హైలైట్స్ తెలిపారు.

“నరకాసుర” కథను డైరెక్టర్ సెబాస్టియన్ చెప్పినప్పుడు ఈ కథ, కథనాల్లోని కొత్తదనం బాగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమాలు వదిలేసే నేను వెంటపడి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పాను. డైరెక్టర్ గా ఈ సినిమాను ఒక న్యూ అప్రోచ్ తో తెరకెక్కించారు. ఆడియెన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ అవుతుంది. రేపు థియేటర్స్ లో సినిమా చూస్తే ఇది నిజమని అర్థమవుతుంది. ఈ కథ డీటెయిల్స్ చెబితే థియేటర్ లో చూసే ఇంట్రెస్ట్ పోతుంది. “నరకాసుర” సినిమాలో నేను ఒక పాము లాంటి స్వభావమున్న క్యారెక్టర్ చేశాను. అంటే మంచి వాళ్లతో మంచిగా ఉంటాడు. చెడ్డ వాళ్లతో చెడుగా ఉంటాడు. నా కెరీర్ లో నేను చేసిన ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది. నాతో పాటు మా అబ్బాయి కూడా ఈ సినిమాలో నటించాడు. అతనికి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ సెబాస్టియన్.

“నరకాసుర” సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెబాస్టియన్ కమిట్ మెంట్, డెడికేషన్ నాకు బాగా నచ్చాయి. అతను ఉదయం షూటింగ్ మొదలైతే రాత్రి వరకు అదే ఉత్సాహంతో వర్క్ చేసేవాడు. సెట్ బాయ్ పని కూడా అవసరమైతే తనే చేసేవాడు. నేను డైరెక్టర్ ను అనే అహం సెబాస్టియన్ ఎప్పుడూ కనిపించలేదు. అతను సినిమా పట్ల ప్యాషన్ తో ఉంటాడు. అందుకే ప్రమాదం జరిగి చేయి కోల్పోయినా అంతే పట్టుదలగా వర్క్ చేశాడు. “నరకాసుర” సినిమాలో హీరో రక్షిత్ చాలా బాగా నటించాను. అతనికి ఈ సినిమాతో మంచి యాక్షన్ హీరోగా పేరొస్తుంది. మంచి ఫ్యూచర్ ఉన్న హీరో రక్షిత్. అతనికి కూడా సినిమా అంటే ఎంతో ఇష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *