నాని హీరోగా నటిస్తున్న 31వ సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ను ఇవాళ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా సాగిన ఈ టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య విలన్ గా కనిపించనున్నారు.

సరిపోదా శనివారం గ్లింప్స్ లో…రాజుకైనా, బంటుకైనా తమదైన ఒక రోజు వస్తుందని చెప్పేవారని, ఈ కాలంలో మన టైమ్ ఒకరోజు వస్తుందిరా అంటుంటాం. కానీ అలాంటి టైమ్ లైఫ్ లో ఒకసారి కాదు, వారికోసారి వస్తే ఎలా ఉంటుంది, వారానికో శనివారం సరిపోదా అంటూ టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఒక గదిలో బంధించి ఉన్న నాని విడిపించుకుని బయటకు రావడం ..ఆ చుట్టు పక్కల జనాలు ఆయన్ను చూసేందుకు ఆసక్తి చూపించడం గ్లింప్స్ లో ఉంది. చివరగా ఒక పాప నవ్వుతో గ్లింప్స్ ముగించారు. పాన్ ఇండియా మూవీగా సరిపోదా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *