కేజీఎఫ్ హీరోయిన్ గా పాన్ ఇండయా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ రెండు సినిమాలకు పేరు, క్రేజ్ వచ్చినా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఆ మధ్య విక్రమ్ నటించిన కోబ్రాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత స్పీడ్ గా ఆమె ఆఫర్స్ దక్కించుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో రాశీ ఖన్నా మరో హీరోయిన్ కాగా…శ్రీనిధి శెట్టి మెయిన్ లీడ్ గా ఉంటుందట. తెలుసు కదా సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం శ్రీనిధి శెట్టి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆమెకు కోటిన్నర రూపాయల పారితోషికం చెల్లించారని టాక్ వినిపిస్తోంది. అది దాదాపు ఓ స్టార్ హీరోయిన్ తీసుకునే ఫీజు. ఇవాళ శ్రీనిధి శెట్టి బర్త్ డే సందర్భంగా తెలుసు కదా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *