నాని హీరోగా నటిస్తున్న 31వ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యార్ లో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న లాంఛనంగా ప్రారంభంకానుంది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జేక్స్ బిజోయ్ పనిచేయబోతున్నారు. థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా నాని 31 ఉండబోతోంది. గతంలో వివేక్ ఆత్రేయ, నాని కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ సినిమాకు భిన్నమైన కథతో ఈసారి సెట్స్ మీదకు వెళ్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *