సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు మిడిల్ ఏజ్ తండ్రి పాత్రలో కనిపిస్తారట. ఈ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వస్తుందని తెలుస్తోంది. మహేశ్ ఇలాంటి ప్రయోగం చేసి చాలా కాలమవుతోంది.

అప్పుడెప్పుడో నాని సినిమాలో తండ్రిగా ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించారు. మళ్లీ అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఇలా కనిపించడం రిస్క్ గా భావించారు మహేశ్. ఆయన తన ప్రతి సినిమాలో వీలైనంత యంగ్ గా కనిపించేందుకే ఇష్టపడుతుంటారు. ఆ మధ్య మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి సర్ ప్రైజ్ చేశారు.

గుంటూరు కారం నుంచి బయటకొచ్చిన ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా..త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 12న గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి త్వరలోనే సాంగ్ రిలీజ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *