ఆర్ఎక్స్ 100తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంగళవారం. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..

లంక గ్రామాల్లోని ఓ ఊరిలో అంతు చిక్కని ఘటనలు జరుగుతుంటాయి. అక్కడి గోడలపై ఊరిలోని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాస్తుంటారు. ఎవరు ఇవన్నీ రాస్తున్నారో ఊరి జనాలకు అర్థం కాదు. ప్రతి మంగళవారం ఊరిలో హత్యలు జరుగుతుంటాయి. ఊరి మర్రిచెట్టుకు ఆ శవాలను వేలాడదీస్తారు. ఊరి దేవతకు ఇష్టమైన రోజు కాబట్టే మంగళవారం ఇలా మరణాలు సంభవిస్తున్నాయని కొందరు చెబుతారు.

మరోవైపు పోలీస్ అధికారి నందిత శ్వేత ఈ హత్యలపై ఇన్వెస్ట్ గేషన్ చేస్తుంటుంది. ఇవన్నీ తనకేమీ పట్టని పాయల్…ప్రియుడితో సుఖంగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఆమెకు ఈ హత్యలకు సంబంధం ఉందా, చాలా జానర్స్ కలిసి ఉన్న మంగళవారం సినిమా కథేంటి అనేది ట్రైలర్ తో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు దర్శకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *