విక్రమ్ హిట్ తర్వాత ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన మణిరత్నం దర్శకత్వంలో తన 234వ మూవీలో నటిస్తున్నారు. నాయకుడు సినిమా తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆ ప్లేస్ ను నయనతార దక్కించుకున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది.

కమల్ హాసన్ జోడీగా ఈ సినిమాలో నయనతార కనిపించనుంది. కోలీవుడ్ మీడియా ఈ న్యూస్ కన్ఫర్మ్ చేస్తోంది. కమల్ 234గా పిలుస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మణిరత్నం రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాలతో రికార్డ్ హిట్ కొట్టారు. విక్రమ్ తో కమల్ సక్సెస్ లో ఉన్నారు. వీరి కాంబో మూవీ కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై మంచి హైప్ ఏర్పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *