లారెన్స్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ చంద్రముఖి 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ సహా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో చంద్రముఖి 2 స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో దర్శకుడు పి.వాసు తెరకెక్కించాడు. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది.

సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన చంద్రముఖి 2 ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే ఈ సినిమా మరీ పూర్ గా పర్ ఫార్మ్ చేసింది. గతంలో రజినీకాంత్ చేసిన చంద్రముఖి సినిమానే ఆర్టిస్టులను మార్చి రూపొందించిన విధానం ఎవరినీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓటీటీలో చంద్రముఖి 2 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *