నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి ఊపిరి సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. కార్తి సినిమా ఏది రిలీజైనా నాగార్జున ఆ సినిమా ఈవెంట్ కు వస్తుంటారు. గతంలో కార్తి నటించిన సర్దార్ సినిమాను నాగార్జునకు చెందిన అన్నపూర్ణ సంస్థ రిలీజ్ చేసింది. ఇప్పుడు కార్తి జపాన్ సినిమాను కూడా ఇదే సంస్థ తెలుగులో రిలీజ్ చేయబోతోంది.

గత దీపావళికి అన్నపూర్ణ సంస్థ రిలీజ్ చేసిన సర్దార్ సినిమా ఈ సంస్థకు మంచి లాభాలు తీసుకొచ్చింది. దాంతో ఈ దీపావళికి రిలీజ్ అ‌వుతున్న జపాన్ సినిమాను కూడా రిలీజ్ చేస్తోంది. ఇవాళ అఫీషియల్ గా అన్నపూర్ణ సంస్థ జపాన్ రిలీజ్ విషయాన్ని వెల్లడించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో దర్శకుడు రాజు మురుగన్ రూపొందించిన జపాన్ మూవీలో కార్తి ఒక ప్లేబాయ్ లాంటి దొంగ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *