యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పాటు మిగతా వర్క్స్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ సినిమా అప్ డేట్ ఒకటి వెల్లడించారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సినిమా పాటల పనుల్లోనే తాను ఉన్నట్లు తెలిపారు.

తాజాగా దేవర సినిమాను ఉద్దేశిస్తూ రైట్ నౌ ఆన్ ది జాబ్ అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఈ సినిమాలో గుర్తుండిపోయే పాటలు రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

దేవరలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *