విజయ్ దేవరకొండ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది టాక్సీవాలా. ఈ సినిమా సక్సెస్ విజయ్ స్టార్ డమ్ ను మరింత స్ట్రాంగ్ చేసింది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను రూపొందించారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ కానుందని సమాచారం.

దర్శకుడు రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండ కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మైత్రీ సంస్థ విజయ్ తో ఖుషి సినిమా చేసింది. ఇప్పుడు రాబోతున్న సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *