విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ టైటిల్ గ్లింప్స్ రీసెంట్ గా రిలీజైంది. ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ కు ఇప్పటిదాాక 15 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ గ్లింప్స్ లో విజయ్ అటు ఫ్యామిలీ మ్యాన్ గా , ఇటు పవర్ ఫుల్ హీరోగా కనిపించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ ఈ సినిమా మీదున్న క్రేజ్ ను చూపిస్తోంది.

విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంటున్న ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. గీత గోవిందం వంటి సక్సెస్ ను ఈ కాంబో మరోసారి రిపీట్ చేస్తారనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *