నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు

టెక్నికల్ టీమ్: సంగీతం: ఎస్ఎస్ థమన్, డీవోపీ: సి రామ్ ప్రసాద్, ఎడిటర్: తమ్మి రాజు, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

కథేంటంటే
జైలు శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి (బాలకృష్ణ) ప్రవర్తనన నచ్చిన జైలర్ (శరత్ కుమార్) అతన్ని సత్ప్రవర్తన కింద విడుదల చేయిస్తాడు. తనకు సహాయం చేసిన జైలర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కూతురు విజ్జీ (శ్రీలీల)ను పెంచే బాధ్యత తీసుకుంటాడు భగవంత్ కేసరి. ఆమెను ఆర్మీలో జాయిన్ చేయించి, గొప్పదాన్ని చేయాలని నిర్ణయించుకుంటాడు. భగవంత్ కేసరి తను అనుకున్నట్లు విజ్జీని ఆర్మీలో చేర్పించాడా లేదా. అసలు భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాల్సివచ్చింది. వ్యాపారవేత్త రాహుల్ సాంగ్వీ (అర్జున్ రాంపాల్)తో భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏంటి అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.

ఎలా ఉందంటే
స్టార్ హీరోల సినిమాలకు కావాల్సిన కథలన్నీ మిక్సీలో వేసి దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన సినిమా ఇది. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అమ్మాయిల గురించి సందేశాత్మక అంశాలు కూడా చేర్చాడు. జైలు నుంచి రిలీజై విజ్జి బాధ్యత తీసుకోవడంతో ఫస్టాఫ్ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఆమెను ఆర్మీకి పంపాలనుకుని ట్రైనింగ్ ఇప్పించడం, అమ్మాయిల సంరక్షణ గురించి గొప్ప గొప్ప సందేశాలు ఇస్తూ సినిమా సాగుతుంది. పెంచిన చిచ్చానే విజ్జి అనుమానించడంతో కథలో ట్విస్ట్ మొదలవుతుంది. విలన్లు విజ్జీని వెంటాడుతుంటే భగవంత్ కేసరి వెళ్లి కాపాడతాడు. భగవంత్ కేసరి గతంలో పోలీస్ ఆఫీసర్ అనేది సినిమా రిలీజ్ ముందే లీక్ అయిన న్యూస్. ఇలాంటి ట్విస్టులు మామూలుగా అయితే సినిమాలో పేలాలి. కానీ భగవంత్ కేసరిలో..ఓహో అవునా అని నిట్టూర్చేలా చేస్తాయి. ఓ పెద్ద బిజినెస్ డాన్ తో భగవంత్ కేసరి పోరాటం ఈ సినిమా బేసిక్ లైన్.

బాలకృష్ణను యువకుడిలా చూపించే వ్యర్థ ప్రయత్నం అనిల్ రావిపూడి చేయకపోవడమే భగవంత్ కేసరికి పెద్ద ఫ్లస్ పాయింట్. మిగతా అంతా రొటీన్ వ్యవహారమే. కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు..సెకండాఫ్ లో మళ్లీ హీరోయిజం మాయలో పడిపోయి కథను ట్రాక్ తప్పేలా చేశాడు. ఫలితంగా సెకండాఫ్ మరీ రొటీన్ గా తయారైంది. హీరోకు పాటలు, అనవసరపు రొమాన్స్ వద్దు అనుకున్నప్పుడు అంతే జెన్యూన్ గా అతని క్యారెక్టర్ ను చూపిస్తే బాగుండేది. యాక్షన్స్ సీన్స్ వచ్చేసరికి మొహమాటం వదిలిపెట్టాడు దర్శకుడు. అనవసరంగా సాగే ఎన్నో సన్నివేశాలు భగవంత్ కేసరిలో ఉన్నాయి. తెలంగాణ యాసలో బాలకృష్ణ మాట్లాడతాడు. శ్రీలీల విజ్జీ గా ఆకట్టుకుంది. కాజల్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయింది. ఆమెకు ఈ సినిమాలో చేసేందుకేం లేదు. భగవంత్ కేసరి చూస్తున్నంత సేపు పాత సినిమాలు చాలా గుర్తొస్తుంటాయి. తెరపై ఎన్ని యాక్షన్ హంగామాలు సృష్టించినా అదేమీ వర్కవుట్ కాలేదు. టెక్నికల్ అంశాలు చూస్తే థమన్ ఈసారి కష్టపడ్డాడు. తన శక్తి మేరకు మంచి వర్క్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *