కోలీవుడ్ హీరో కార్తి నటిస్తున్న కొత్త సినిమా జపాన్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. జపాన్ సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే..

సిటీ మధ్యలో 200 కోట్ల రూపాయల భారీ దొంగతనం జరుగుతుంది. నగలు, డబ్బు చోరీకి గురవుతుంది. ఈ దొంగతనం జపాన్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తారు. నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న దొంగ అతను. అతని మీద 182 కేసులు ఉన్నాయి. దొంగతనం చేసిన డబ్బుతో బంగారం కొనుక్కోవడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం జపాన్ హాబీలు. అతన్నో ఐటెం రాజాగా టీజర్ లో చూపించారు. జపాన్ ను పోలీసులు రౌండప్ చేయడంతో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది. పోలీసులు జపాన్ ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. కార్తి ఇలాంటి క్రిమినల్ ప్లేబాయ్ క్యారెక్టర్ లో కనిపించడం ఇదే తొలిసారి. సునీల్ కు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నట్లు టీజర్ తో తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *