స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఫ్యామిలీ స్టార్ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఫ్యామిలీ స్టార్ టీజర్ లో..ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్ గా..బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ కనిపించారు. లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్ కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడగా…భలే మాట్లాడతారన్నా మీరంతా…ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా…పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా…ఐరెన్ వంచాలా ఏంటి అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన విజయ్…విలన్ గ్యాంగ్ లోని ఒకడి తల పగలగొట్టి సారీ బాబాయ్…కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా..తలకాయ కొట్టేశా అని విలన్ కు షాక్ ఇవ్వడం కూల్ హీరోయిజం చూపించింది. టీజర్ చివరలో బ్యూటిఫుల్ యంగ్ కపుల్ గా విజయ్, మృణాల్ మధ్య ఎమోషనల్ బాండింగ్ రివీల్ చేశారు. టీజర్ తో ఫ్యామిలీ స్టార్ ఒక కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *