రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది పుష్ప 2 సినిమా. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా నుంచి ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్ లైక్స్ అందుకుంది. ఇండియన్ మూవీ హిస్టరీలో ఏ సినిమా పోస్టర్ కు ఇన్ని భారీ లైక్స్ రాలేదని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

దర్శకుడు సుకుమార్ రూపొందించిన పుష్ప పాన్ ఇండియా సక్సెస్ అవడంతో పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో చిత్రబృందం మరిన్ని జాగ్రత్తలతో సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని ఇటీవల నిర్మాత నవీన్ యెర్నేని ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైమ్ తీసుకోనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *