చైతన్య రావ్, బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కీడా కోలా. ఈ సినిమాను దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించారు. ఇందులో ఆయన ఓ కీలక పాత్రను కూడా పోషించారు. నవంబర్ 3న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇవాళ రానా చేతుల మీదుగా కీడా కోలా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…

కీడా కోలా సీరియస్ పాయింట్స్ ఉన్న కామెడీ సినిమా అని తెలుస్తోంది. లిమిటెడ్ క్యారెక్టర్స్ తీసుకుని వాటి చుట్టూ కథను తెరకెక్కించారు. కోలాలో బొద్దింక పడటం, దాన్ని కేసుగా వేసి కంపెనీ దగ్గర కోట్లు దండుకోవచ్చనే ప్లాన్ వేయడం ట్రైలర్ లో ఉంది. అలాగే ఒక బార్బీ బొమ్మ హీరో చైతన్య రావ్ వల్ల డ్యామేడ్ అ‌వడం, దానికి కోటి రూపాయల వ్యాల్యూ కట్టాలని అనడం కనిపించింది. డబ్బుల్లేక పేదరికంలో మగ్గే హీరో అంత భారీ మొత్తం ఎలా చెల్లిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది. ప్రతి పాత్రతో ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. వరదరాజులు తాతగా బ్రహ్మానందం, వాస్తుగా చైతన్యరావు, లంచంగా రాగ్ మయూర్, నాయుడుగా తరుణ్..ఇలా లీడ్ రోల్స్ అన్నీసీరియస్‌గా కనిపించినా వారి పనులు మాత్రం నవ్వించేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ లో కథ ఇదని ఊహించుకోలేని గందరగోళం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *