హీరో రాజశేఖర్ కు పేరు తెచ్చిన సినిమాల్లో ఎక్కువగా పోలీస్ స్టోరీలే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా సెట్ లో రాజశేఖర్ రీసెంట్ గా అడుగుపెట్టారు.

ఈ సినిమాను దర్శకుడు వక్కంతం వంశీ రూపొందిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జూనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన ఓ యువకుడు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథాంశం. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ గత సినిమా మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ కావడంతో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా మీద హైప్ రావడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *