పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా ప్రమోషన సందడి బిగిన్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడే ట్రైలర్ ను ఆగస్టులో తీసుకొస్తామని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వెల్లడించింది. అన్నట్లుగానే ఆగస్టు చివరలో ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేకు సలార్ లోని ఒక పాటను రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ట్రైలర్ తో పాటు మిగతా ప్రమోషనల్ యాక్టివిటీ కూడా కంటిన్యూగా చేయాలని సలార్ టీమ్ నిర్ణయించిందిట. సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో మరింత హైప్ తీసుకురావాలని వారు భావిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా..మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *