హీరోలకు హిట్స్ అండ్ ఫ్లాప్స్ సహజం. మహేశ్ బాబుకు కూడా ఎన్నో సూపర్ హిట్స్ తో పాటు వాటికి మించిన ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. మహేశ్ ఖాతాలో నిజం, ఖలేజా, బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి సూపర్ ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే సక్సెస్ తో పాటు ఈ ఫెయిల్యూర్ ను కూడా కూల్ గా తీసుకుంటానని మహేశ్ చెబుతున్నాడు. రీసెంట్ ఓ కార్యక్రమంలో మహేశ్ తన ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడాడు.

స్టార్ హీరో అయినప్పటి నుంచే సక్సెస్ తో పాటు ఫెయిల్యూర్ ను కూడా యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ అలవాటు చేసుకున్నానని మహేశ్ చెప్పారు. ఎవరికీ లైఫ్ లో సక్సెస్ ఊరికే రాదని, ఎంతో కష్టపడితేనే అది దక్కుతుందని ఆయన అన్నారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి తాను ఈ విషయాలు నేర్చుకున్నానని మహేశ్ చెప్పారు. ఒక సినిమా కోసం ఎంతో మంది కష్టపడతారని, ఫ్లాప్ బాధ్యత తానే తీసుకుంటానని మహేశ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *