వెంకటేష్ కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది రానా నాయుడు వెబ్ సిరీస్. రానాతో కలిసి వెంకటేష్ నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో గతేడాది స్ట్రీమింగ్ అయ్యింది. హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్ అయిన రానా నాయుడు అడల్ట్ కంటెంట్ తో బూతు మాటలతో వెంకటేష్ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఈ వెబ్ సిరీస్ చేసినందుకు వెంకటేష్, రానా విమర్శల పాలయ్యారు. రానా కంటే వెంకటేష్ నే అంతా తప్పు పట్టారు. ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి వెబ్ సిరీస్ చేసి ఉండకూడదని ట్రోల్స్ వచ్చాయి.

ఇలాంటి బ్యాడ్ ప్రాజెక్ట్ విషయంలో అప్పట్లో విచారం వ్యక్తం చేశారు వెంకటేష్. అయితే ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటూనే రానా నాయుడు సీక్వెల్ కూడా చేస్తానని చెబుతున్నారు. ఇవాల్టి సైంధవ్ ప్రెస్ మీట్ లో వెంకటేష్ ఈ విషయాన్ని చెప్పాడు. రానా నాయుడులో బూతుల కంటెంట్ హిందీతో చూస్తే చాలా తక్కువని, వచ్చే సీక్వెల్ లో మరింత తగ్గిస్తామని చెప్పాడు. అంటే చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేయబోతున్నాడు వెంకీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *