వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా సైంధవ్ టీజర్ వచ్చేసింది. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇతర కీలక పాత్రల్లో రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపించబోతున్నారు.

సైంధవ్ టీజర్ చూస్తే…సౌతిండియాలోని సీ సిటీ చంద్రప్రస్థలో ఈ కథను బిగిన్ చేశారు. ఇక్కడ పోర్ట్ ఏరియాలో అక్రమ ఆయుధాల రవాణా జరుగుతుంటుంది. ఈ ఆయుధాలతో అమాయకులైన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ వారిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారు చేస్తుంటారు కొందరు. కొన్ని పర్సనల్ కారణాలతో సైంధవ్ డ్యూటీ నుంచి తప్పుకోవడంతో విలన్స్ ఆటలకు అడ్డే ఉండదు. కానీ ఒక టైమ్ కు సైంధవ్ మళ్లీ తిరిగివస్తాడు. అక్రమ రవాణా చేస్తున్న వారి ఆటలు కట్టిస్తాడు. సైంధవ్ ను డిపార్ట్ మెంట్ సైకో అని పిలుస్తుంటుంది. ఎందుకంటే అతను విలన్స్ ను ఏరిపారేయడంలో అంత వైల్డ్ గా ఉంటాడు.

టీజర్ రిలీజ్ సందర్భంగా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు ఎక్కడా హింట్ ఇవ్వలేదు. దీంతో సైంధవ్ కేవలం తెలుగులోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జవనరి 13న తెరపైకి రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *