అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడి. వీరి కాంబోలో ఇప్పటిదాకా మూడు సినిమాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వచ్చాయి. వీటిలో అల వైకుంఠపురములో సూపర్ హిట్టయ్యింది. ఈ కాంబోలో నాలుగో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. హారికా హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా కథ గురించి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ముంబై నేపథ్యంగా సాగే పోలీస్ కథని, ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ ఉంటుందట. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా కథ జరిగే ప్లేస్ ను ముంబైగా సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. గుంటూరు కారం నుంచి త్రివిక్రమ్, పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ బయటకు రాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *