రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. మాన్షన్ 24లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మాన్షన్ 24 ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ – ఇన్ కేబుల్ అనే చిన్న కేబుల్ టీవీ నుంచి నా కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి మాన్షన్ 24 సిరీస్ తెరకెక్కించే వరకు మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ప్రేక్షకులు నాకు సపోర్ట్ గా ఉన్నారు. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ ను ఆదరిస్తూ వచ్చారు. అందుకు మీ అందరికీ నా థ్యాంక్స్. నేను రూపొందించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. మాన్షన్ 24 ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ రాత్రి నుంచే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూస్తూ ఎంజాయ్ చేసే మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఇది నా ఒక్కడి క్రిడెట్ కాదు. మా ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు ఇలా టీమ్ అంతా కష్టపడి మంచి ప్రాడక్ట్ తీసుకొచ్చారు. అన్నారు. నటి అభినయ మాట్లాడుతూ – రాజు గారి గది, జీనియస్ తర్వాత ఓంకార్ గారితో నేను చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది. హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తన సినిమాల్లో నాకు అవకాశాలు ఇస్తున్న ఓంకార్ గారికి థ్యాంక్స్. మాన్షన్ 24లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అని చెప్పింది

నటి అర్చనా జాయిస్ మాట్లాడుతూ – కేజీఎఫ్ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే ఈ మాన్షన్ 24తో తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్నాను. కేజీఎఫ్ తర్వాత మదర్ క్యారెక్టర్స్ వద్దని చెబుతున్నాను. కానీ ఈ సిరీస్ లో మదర్ క్యారెక్టర్ లోనూ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే మాన్షన్ 24లో వర్క్ చేశాను. ఓంకార్ తో వర్క్ చేయడం హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది. ఈ సిరీస్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ – మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో సత్యరాజ్ గారి లాంటి గొప్ప నటుడితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఇది నాకు ఫస్ట్ వెబ్ సిరీస్. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. డబ్బింగ్ చెప్పేప్పుడు అన్ని ఎపిసోడ్స్ చూశాను. సిరీస్ చాలా బాగా వచ్చింది. మేము ఇంట్లో రాత్రి హారర్ మూవీస్ చూడము. కాబట్టి డేలో అన్ని ఎపిసోడ్స్ చూస్తాను. నాకు ఛాలెంజింగ్ అనిపించిన రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. మాన్షన్ 24లో నాకు అలాంటి సవాల్ లాంటి రోల్ దొరికింది. ఇందులో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే కూతురిగా కనిపిస్తా. బయట మనం చూసే అమ్మాయిల్లా సహజంగా నటించాను. అన్నారు.

నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ – మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఓంకార్ తన పర్ ఫెక్షన్ తో ఈ హారర్ సిరీస్ ను ఆకట్టుకునేలా రూపొందించాడు. బడ్జెట్ వైజ్ అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నేను సెట్ లో ఏమాత్రం ఖాళీ టైమ్ దొరికినా వాకింగ్ చేస్తుంటాను. కానీ మాన్షన్ 24 సెట్ లో ఓంకార్ నాకు అలాంటి టైమ్ ఇవ్వలేదు. పర్ ఫెక్ట్ గా వర్క్ చేయించుకున్నాను. ఈ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కు తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాను. నేను శరత్ కుమార్ కలిసి నటించే సినిమాల షూటింగ్ టైమ్ లో వరలక్ష్మి సెట్ కు వచ్చేది. అప్పుడు ఆమె చిన్న పాప. ఇప్పుడు ఆమెతో కలిసి నటిస్తుండటం ఆ మెమొరీస్ గుర్తుకు తెస్తోంది. వీరసింహారెడ్డిలో వరలక్ష్మి యాక్టింగ్ చూసి షాక్ అయ్యాను. నేను దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ మాన్షన్ 24 ట్రైలర్ చూశాక భయమేసింది. హారర్ ఫిలింస్ తో మెప్పించాలంటే దర్శకుడికి ఫిలిం మేకింగ్ లో కొన్ని గిమ్మిక్ లు తెలిసి ఉండాలి. అలాంటివి ఓంకార్ కు బాగా తెలుసు. మాన్షన్ 24 సీజన్ 1 ఎండింగ్ బాహుబలి 1 క్లైమాక్స్ లాంటి ఇంపాక్ట్ తో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలి. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *