డౌట్స్ అన్నీ పక్కనపెట్టి తన కొత్త సినిమా గుంటూరు కారం మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు స్టార్ హీరో మహేశ్ బాబు. స్టార్టింగ్ ట్రబుల్స్ ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పుడు స్మూత్ గా షూటింగ్ చేసుకుంటోంది. ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరిపారు. నవంబర్ చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేయాలని టీమ్ ప్లాన్స్ లో ఉంది.

డిసెంబర్ చివరి కల్లా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గుంటూరు కారంను కంప్లీట్ చేసి..జనవరి రిలీజ్ కు కంఫర్ట్ గా రెడీ కావాలని మహేశ్ భావిస్తున్నారట. అందుకే ఇంటరప్షన్ లేని కంటిన్యూ షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదిరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న గుంటూరు కారం సినిమా తెరపైకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *