ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాను అన్ని హంగులతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు బాలీవుడ్ హీరోను అప్రోచ్ అవుతున్నారట టీమ్. సాధారణంగా ఈ క్యారెక్టర్ ఇక్కడి ఆర్టిస్టులతో చేయించుకోవచ్చు. అయితే దేవర పాన్ ఇండియా మూవీ కావడంతో అదే గ్రాండియర్ తో అన్ని భాషల ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా కాస్టింగ్ చేస్తున్నారట. కథలో ప్రాధాన్యత ఉండే ఆ పాత్రలో నటించే బాలీవుడ్ హీరో పేరును అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబో మూవీ దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *