లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మాళవిక నాయర్. కల్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో ఆమె ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తోంది. సామాజిక ఉద్యమకారిణి మణిమేకల క్యారెక్టర్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ పబ్లిక్ మీటింగ్ లో మణిమేకల మాట్లాడుతున్న స్టిల్ రివీల్ చేశారు.

బ్రిటీష్ పాలనా కాలంలో పనిచేసిన సీక్రెట్ ఏజెంట్ కథతో దర్శకుడు నవీన్ మేడారం డెవిల్ సినిమాను రూపొందించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తన కెరీర్ లో స్పెషల్ మూవీ అంటూ కల్యాణ్ రామ్ చెప్పుకుంటున్నారు. నవంబర్ 24న డెవిల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇటీవల ప్రొడ్యూసర్ అభిషేక్ నామా, డైరెక్టర్ నవీన్ మేడారం మధ్య విభేదాల వల్ల డైరెక్టర్ పేరు తొలగించి తన పేరే డైరెక్టర్ గా వేసుకున్నారు నిర్మాత అభిషేక్ నామా. ప్రొడ్యూసర్ చేసిన ఈ పనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *