నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన కిస్మత్ సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్రాన్ని కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ కలిసి నిర్మించాయి. ఈ చిత్రానికి శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు. కిస్మత్ సినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా టీజర్ లో ఇంజినీరింగ్ చేసి ఉద్యోగం దొరక్క బ్యాడ్ టైమ్ లో ఉన్న నిరుద్యోగ యువకుల క్యారెక్టర్స్ లో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్. తమ కిస్మత్ కూడా ఏదో ఒక రోజు మారుతుందని నమ్ముతుంటారు. ఊరి నుంచి సిటీకి చేరిన వీరు ఓ వ్యక్తిపై దాడి చేసి పోలీస్ కేసులో ఇరుక్కుంటారు.

ఏంటా కేసు, ఎందుకు వీళ్లు అతనిపై దాడి చేయాల్సివచ్చిందనే ఆసక్తితో ఇంట్రెస్టింగ్ గా టీజర్ ముగిసింది. ఇంజినీరింగ్ చేసినా నాలెడ్జ్ లేని మరో జాతిరత్నాల్లాంటి క్యారెక్టర్స్ ఈ సినిమా టీజర్ లో కనిపించాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *