తన కొత్త సినిమా హాయ్ నాన్న ప్రెస్ మీట్ లో మీడియా ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశారు హీరో నాని. ఆయన చేస్తున్న కొత్త తరహా మూవీస్ కమర్షియల్ గా వర్కవుట్ కావడం లేదన్న ప్రశ్నకు నాని ఫైర్ అయ్యారు. శ్యామ్ సింగరాయ్, జెర్సీ సినిమాలు ప్రొడ్యూసర్ కు లాస్ తీసుకొచ్చాయి అనే మాటను నాని ఒప్పుకోలేదు.

ఆ రెండు సినిమాలు అన్ని విధాలా ప్రొడ్యూసర్స్ కు లాభాలు తీసుకొచ్చాయని నాని చెప్పారు. అయితే అంటే సుందరానికీ విషయంలో కొంత అనుకున్న రికవరీ కాలేదని నాని ఒప్పుకున్నారు. అన్ని విషయాలు తెలిసిన జర్నలిస్టులు కూడా అసత్యాల ప్రచారాలపై క్వశ్చన్స్ చేయొద్దని నాని సూచించారు. ప్రభాస్ తనకు అన్నలాంటి వాడన్న నాని, సలార్ తో పోటీ పడకుండా తన సినిమాను ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు.

నాని జెర్సీ విషయంలో చేసిన కామెంట్స్ కు సపోర్ట్ చేస్తూ నిర్మాత నాగవంశీ ట్వీట్ చేేశారు. కమర్షయిల్ గా ప్రేక్షకుల మెప్పును, విమర్శకుల ప్రశంసలు, అవార్డులను జెర్సీ సినిమా తమకు అందించిందని, ఈ సినిమా ప్రొడ్యూసింగ్ విషయంలో గర్వపడుతుంటామని నాగవంశీ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *