హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదాకు తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ఆమె తమిళ సినిమాల్లోనూ మెరిసింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ, రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన మెహ్రీన్ ఎక్స్ పోజింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆమెకు ట్రెడిషినల్ హీరోయిన్ గానే పేరుంది. అయితే ఆమె డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కోసం చేసిన రీసెంట్ వెబ్ సిరీస్ ఒకటి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది.

తన కొత్త వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ లో మెహ్రీన్ చేసిన ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. మెహ్రీన్ నుంచి ఇలాంటివి ఎక్స్ పెక్ట్ చేయలేదని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెహ్రీన్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎలాంటి సినిమాల నుంచి ఎలాంటి వెబ్ సిరీస్ కు వెళ్లిపోయింది మెహ్రీన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల తమన్నా కూడా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో తన ఎక్స్ పోజింగ్ తో షాక్ కు గురిచేసింది. సినిమాల్లో బాగా కనిపించే హీరోయిన్స్ అంతా ఇలా వెబ్ సిరీస్ లకు వచ్చేసరికి హద్దులు దాటి నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *