నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హాయ్ నాన్న టీజర్ రేపు రిలీజ్ అవుతోంది. రేపు ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇవాళ ప్రకటించారు. ఈ సినిమాను వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

తండ్రీ కూతురు సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హాయ్ నాన్న రూపొందుతోంది. ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 21న రిలీజ్ కావాల్సిఉంది. అయితే ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న వస్తుండటంతో హాయ్ నాన్న రిలీజ్ డైలమాలో పడింది.

డిసెంబర్ 21న రిలీజ్ చేస్తారా లేదా అనేది లేటెస్ట్ ప్రమోషన్స్ లో డేట్ ఎక్కడా పేర్కొనడం లేదు. దీంతో మూవీ టీమ్ కూడా డౌట్ లోనే ఉన్నట్లు అర్థమవుతోంది. దసరా వంటి యాక్షన్ మూవీ తర్వాత నాని కూల్ ఫ్యామిలీ సినిమా చేయడం హాయ్ నాన్నకు ఫ్రెష్ నెస్ తెస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *