యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు సక్సెస్ ఇచ్చిన సినిమా రాక్షసుడు. తమిళంలో హిట్ అయిన రాక్షసన్ కు ఇది తెలుగు రీమేక్. దర్శకుడు రమేష్ వర్మ రూపొందించిన రాక్షసుడు తెలుగులో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు రమేష్ వర్మ.

బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ రాక్షసుడు 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తారని తెలుస్తోంది.

బెల్లంకొండ హిందీలో ఛత్రపతి రీమేక్ చేశాడు. ఆ సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మూవీ సక్సెస్ కాలేదు. ఇటు రమేష్ వర్మ కూడా రవితేజతో ఖిలాడీ సినిమా చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇలాంటి టైమ్ లో తమకు కలిసొచ్చిన రాక్షసుడు కథ విజయాన్ని అందిస్తుందని వీరిద్దరు నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *