విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టీజర్ కు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ టైటిల్ ప్రచారంలో ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

వీడీ 13 సినిమా టీజర్ ను ఈ నెల 16న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్న ఆ డేట్ ను మరో రెండు మూడు రోజుల తర్వాతకు మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 18 లేదా 19న ఈ క్రేజీ మూవీ టీజర్ విడుదల చేస్తారని అంటున్నారు. జనవరి 12న ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా రాబోతోంది. విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల కాంబోలో గీత గోవిందం సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *