మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ముల్లోక వీరుడు టైటిల్ యాప్ట్ అనుకుంటున్నారట. గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ అయ్యింది. ఇప్పుడు అదే ప్యాట్రన్ లో ముల్లోక వీరుడు టైటిల్ హైప్ తెస్తుందని సినిమా టీమ్ భావిస్తున్నారు.

మెగా 157గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకుంది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క శెట్టి, ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వరల్డ్ క్లాస్ స్పెషల్ ఎఫెక్టులతో భారీ సోషియో ఫాంటసీ మూవీగా మెగా 157 తెరకెక్కనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అంతే గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *