బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సినిమాల సిరీస్ లాగ..తెలుగులో ఎఫ్ 2 మూవీ సిరీస్ లోని రెండు సినిమా ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి. ఈ రెండు సినిమాల్లో ఎఫ్ 2 పెద్ద హిట్ అయ్యింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగాలుగా నటించిన ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

హిందీలో కూడా ఎఫ్ 2ను దిల్ రాజు నిర్మించాలని అనుకుంటున్నారు. ఆయన హిట్ 2, జెర్సీ మూవీస్ ను హిందీలో ప్రొడ్యూస్ చేశారు. ఈ అనుభవంతో ఎఫ్ 2ను కూడా హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ ఉత్తరాది ఆడియెన్స్ ఇష్టపడతారు. ఈ రీమేక్ కు దర్శకుడు, ఆర్టిస్టులు ఎవరనేది ఇంకా పైనలైజ్ కాలేదు. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *