హీరో రానా, దర్శకుడు తేజ కాంబినేషన్ లో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అయ్యింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ డ్రామా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందులో కాజల్ సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సక్సెస్ నేపథ్యంలో ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రానా, తేజ కలిసి సినిమా చేస్తున్నారు. ఆ మధ్య ఫార్మల్ గా వీళ్లిద్దరు తాము కలిసి సినిమా చేస్తున్నట్లు, దాని పేరు రాక్షస రాజు అని తెలిపారు.

ఇప్పుడీ ప్రాజెక్ట్ రియాల్టీలోకి వచ్చేస్తోంది. రానా, తేజ కాంబో మూవీకి ఈ నెలలోనే ముహూర్తం పెడుతున్నారు. ఈ నెల 28న ఈ కాంబో మూవీ సినిమా లాంఛనంగా ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. రాక్షస రాజుగా రానాను నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ లో తేజ చూపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *