రామ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ స్కంధ ఓటీటీ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ సంస్థ నిర్మించింది. శ్రీలీలా, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. గత నెల రిలీజైన స్కంధ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఓటీటీలో ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

స్కంధ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27న స్ట్రీమింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. దసరా పండుగ తర్వాత ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. యాక్షన్ మూవీస్ ఓటీటీలో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ లెక్కన స్కంధలో యాక్షన్ పార్ట్ ఎక్కువే కాబట్టి ఆ సెక్షన్ ఆడియన్స్ ను ఓటీలో ఇంప్రెస్ చేస్తుందనుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేస్తారని దర్శకుడు సినిమా చివరలో ప్రకటించినా…అది కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *